WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఫిరంగడ్డలో శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్రమంగా నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్న వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసిన సారాయిని తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు.