MLG: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసులో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలంతా గమనించి సహకరించాలని ఆయన పేర్కొన్నారు.