TG: హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంచనున్నారు. 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది.