కోనసీమ: ఈ నెల 7వ తేదీ మంగళవారం అమలాపురం కలెక్టరేట్లోని వికాస కార్యాలయం ఆవరణలో మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తెలిపారు. ఫాక్స్కాన్ (బెంగళూరు), పహార్పూర్ ప్రైవేట్ లిమిటెడ్ (శ్రీసిటీ) కంపెనీలలో ఉద్యోగాల కోసం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, అభ్యర్థులు తమ బయోడేటాతో హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.