E.G: జంతువుల పరిరక్షణ అవసరమే కానీ అతిగా చూపించే ప్రేమ సమాజానికి హానికరమని ఎస్.కె.ఆర్.ఉమెన్స్ కాలేజీ విశ్రాంత లెక్చరర్ కాటం రమాదేవి అన్నారు. రాజమండ్రిలో శనివారం జరిగిన అంతర్జాతీయ జంతు దినోత్సవ సభలో మాట్లాడుతూ.. ఫ్యాషన్ కోసం కుక్కలను పెంచే ధోరణి ప్రాణనష్టానికి దారి తీస్తుందని హెచ్చరించారు.