KDP: చాపాడు మండలం విశ్వనాధపురం సమీపంలో ఏటూరు కాలువ వద్ద శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. SI చిన్న పెద్దయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు వెల్లడించారు. మృతుడికి సుమారు 50 సంవత్సరాలకు పైగా వయసుంటుంది. మృతదేహం కుల్లడంతో మెహం గుర్తించలేని స్థితిలో ఉంది. పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.