TG: హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, SR నగర్, పంజాగుట్ట, ఫిలింనగర్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.