KDP: తాగు, సాగు నీటికి తొలి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. పులివెందుల పరిసర గ్రామాల్లో ఒక్కరోజు కూడా తాగునీటి కొరత రాకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం పులివెందుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (PBC)ను ఆయన తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ (HLC) ఛైర్మన్ మారెడ్డి జోగిరెడ్డితో కలిసి పరిశీలించారు.