ELR: 2025 డిసెంబర్ 7న జరగనున్న NMMS పరీక్షకు దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు డీఈఓ వెంకట లక్ష్మమ్మ ప్రకటించారు. ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 16న పాఠశాలల నుంచి నామినల్ రోల్ సమర్పణకు అక్టోబర్ 18 చివరి తేదీ అన్నారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు.