MDK: పెద్ద శంకరంపేట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు మురళి పంతులు ప్రకటించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ..అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వివరించారు. రాజీనామా లేఖను పార్టీ జిల్లా అధ్యక్షులు పద్మ దేవేందర్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిలకు పంపినట్లు ఆయన తెలిపారు.