కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్-ఎ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 122 బంతులు ఎదుర్కొన్న తిలక్ 94 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.