ATP: తాడిపత్రిలో దసరా ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తుల సమక్షంలో విజయదుర్గాదేవి శోభాయాత్ర నిర్వహించారు. ఎల్లనూరు రోడ్డు నుంచి గాంధీ సర్కిల్, గాంధీ కట్ట, బస్టాండ్ మీదుగా కడప రోడ్డు వరకు శోభాయాత్ర కొనసాగింది. మహిళలు భక్తిశ్రద్ధలతో కళశాలను ప్రదర్శించారు. రైల్వేకొండాపురం మండలం సుగుమంచిపల్లి వద్ద దేవి విగ్రహ నిమజ్జనం నిర్వహించారు.