అన్నమయ్య: శ్రీశైలం దేవస్థానం ఆలయ ఛైర్మన్గా బీజేపీ నాయకులు పోతుగుంట రమేష్ నాయుడు ఇటీవల నియమితులైనారు. ఈ సందర్భంగా శుక్రవారం వారి నివాసంలో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు కలిసి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ జడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ పాల్గొన్నారు.