అన్నమయ్య: మదనపల్లెలోని శ్రీ చౌడేశ్వరి ఆలయం నందు దసరా మహోత్సవ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు పది, ఇంటర్, డిగ్రీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి రూ. 2.500 చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులు బాగా చదివి సమాజానికి, దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు.