PDPL: రామగుండం-2 ఏరియా పరిధిలోని ఓసీపీ-3 ఉపరితల గనిలో గురువారం ప్రమాదం జరిగింది. సెకండ్ షిఫ్ట్‌లో ప్రగతి షావల్ నడుపుతున్న ఈపీ ఆపరేటర్ ఈ.లక్ష్మీనారాయణ (45) పొగ కారణంగా మార్గం కనబడక మిషన్‌ను బోల్తా కొట్టించాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతడికి సర్జరీ చేసి చికిత్స అందిస్తున్నారు.