మేడ్చల్: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెబ్ సైట్లో HYD సమీపంలోని కీసరగుట్ట దేవాలయానికి సంబంధించిన వివరాలను పొందుపరచినట్లు జాయింట్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందులో పేర్కొన్నట్లు వివరించారు. శివయ్య భక్తులకు కీసరగుట్ట ప్రాంతం, అత్యంత ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించే కేంద్రంగా వర్ధిల్లుతుందని చెప్పారు.