BDK: పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో వివిధ రకాల హోమాలు, జపాలు, అభిషేకాలు, పూజలు శాస్త్రోక్తరంగా నిర్వహించారు. ఉత్సవాల అనంతరం శుక్రవారం దేవస్థాన ఆవరణలో సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆలయ అర్చకులు వైభవంగా జరిపారు. పూజలో భక్తులు, ఈవో రజిని కుమారి ఉన్నారు.