TPT: తడ పీఏసీఎస్ ఛైర్మన్‌గా వేనాటి శ్రీకాంత్‌రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఛైర్మన్, సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.