WGL: ఉమ్మడి వరంగల్ పరిధిలోని MLG, MHBD జిల్లాల జడ్పీ పీఠాల నిర్ణయంలో మంత్రి సీతక్క కీలక పాత్ర పోషించనున్నారు. ములుగు జిల్లా జడ్పీ పీఠం ఎవరికి దక్కాలన్నది సీతక్క నిర్ణయిస్తారు. అలాగే, MHBD జిల్లా జడ్పీ పీఠం కూడా ఆమె ప్రభావంతోనే నిర్ణయం కానుంది. సీతక్క నియోజకవర్గంలోని గంగారం మండలం ZPTC జనరల్ కావడంతో, ఆమె సూచనల మేరకు జడ్పీ పీఠం దక్కే అవకాశం ఉంది.