MNCL: మందమర్రి పట్టణం పాలచెట్టు ఏరియాలో ఇద్దరు యువకులపై కొంత మంది యువకులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు CI శశిధర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆటో యు టర్న్ చేసుకునే సందర్భంలో రెండు గ్రూప్‌లకు గొడవ జరిగిందన్నారు. దాడిలో పచ్చిక రవితేజ,రాకేష్ అనే యువకులకు గాయాలయ్యాయి. బాధితుడు రవితేజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామన్నారు.