అన్నమయ్య: మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయడంలో పాలకపక్షం ఇచ్చిన హామీని విస్మరించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. రెడ్డి సాహెబ్ ఆరోపించారు. స్థానిక తాహసీల్దార్ కార్యాలయం నందు జాతిపిత విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా సాధన కోసం అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. జిల్లా విషయమై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.