VSP: విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 4వ తేదీన జరగనుంది. జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన, ఉదయం 10:30 గంటలకు స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరుకావాలని, జెడ్పీటీసీ, ఎంపీపీలు తప్పకుండా పాల్గొనాలని జెడ్పీ సీఈఓ పి. నారాయణమూర్తి శుక్రవారం కోరారు.