WNP: అధికారంలో ఉండి అడ్డగోలుగా ప్రజల సొమ్మును దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి మనుగడలేదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మదనాపురం మండలం దుప్పల్లికి చెందిన గౌడసంఘం నేతలు జనార్దన్ గౌడ్, బలరాంగౌడ్, పుల్లయ్యగౌడ్, లచ్చగౌడ్ తదితరులు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు