వనపర్తి జిల్లా నాగవరం శివారులో కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ. జిల్లా బీజేపీ నాయకులు శుక్రవారం జిల్లా కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డీ. నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ నాయకత్వం కృషి వల్లే విద్యాలయం మంజూరైందని తెలిపారు.