NZB: SRSPలోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి 2.72 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 2,01,447 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇందులో 39 వరద గేట్ల ద్వారా 1.92 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడిచిపెడుతున్నట్లు చెప్పారు. 75.314 TMC నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.