VSP విశాఖ శ్రీ శారదా పీఠంలో 11 రోజుల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. శ్రీ విజయదుర్గా అలంకారంలో అమ్మవారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. పీఠాధిపతుల సమక్షంలో అభిషేకాలు, శమీ పూజ, ఆయుధ–వాహన పూజలు, రాజశ్యామల సహిత చండీయాగం మహాపూర్ణాహుతితో ముగిసింది. 100 కేజీల పసుపు కొమ్ములతో హరిద్రాఖండ సేవ జరిపించారు.