BHNG: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోని నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని కోరారు.