తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి “భాగ్ సవారి” ఉత్సవం శుక్రవారం సాయంత్రం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల మరుసటి రోజు ఆనవాయితీగా జరిగే ఈ ఉత్సవంలో, పురాణ నేపథ్యానుసారం స్వామివారు శ్రీదేవి సమేతంగా అనంతాళ్వారు తోటకు అప్రదక్షిణంగా చేరి ప్రత్యేక పూజలు స్వీకరించి తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా అనంతాళ్వారు వంశీకులు నాళాయరా దివ్య ప్రబంధం నిర్వహించారు.