MDK: తూప్రాన్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఆధ్వర్యంలో పద సంచలన్ రూట్ మార్చ్ నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తూప్రాన్ పట్టణంలో 250 మంది ఆర్ఎస్ఎస్ సేవకులు ర్యాలీ నిర్వహించగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.