ATP: జిల్లాలో 3,859 మెట్రిక్ టన్నులు యూరియా నిల్వగా ఉన్నట్లు వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ తెలిపారు. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్, ప్రైవేటు డీలర్లు, హోల్సేల్ గోదాములు, కంపెనీల వద్ద యూరియా నిల్వ ఉందన్నారు. సీఐఎల్ ద్వారా 1,009.5 మెట్రిక్ టన్నులు రైలు మార్గంగా జిల్లాకు చేరాయని వివరించారు.