Vsp: విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన శనివారం సాయంత్రం జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ,ఎస్టీ చట్టం కింద 46 కేసుల్లో బాధితులకు రూ.79 లక్షల పరిహారం అందించామని, పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాన్యువల్ స్కావెంజర్ల కుటుంబాలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి పరచాలని అధికారులకు సూచించారు.