KRNL: సి. బెళగల్ తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేలా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి పోరాడుతామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష పిలుపునిచ్చారు. శనివారం సంగాల గ్రామ రైతులతో గుండ్రేవుల ప్రాజెక్టు ఆవశ్యకతపై చర్చించారు. అనంతరం తుంగభద్ర నది వద్ద గుండ్రేవుల ప్రాజెక్టును సందర్శించారు.