TPT: సత్యవేడు పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో రెండో నిందితుడు లారెన్స్ (30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సత్యవేడు పట్టణం చెన్నై మార్గంలో మాదర్పాకం క్రాస్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో పరారీలో ఉన్న లారెన్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, రెండో నిందితుడైన లారెన్స్‌ను పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు.