KMM: సీపీఐ శతాబ్ది సంవత్సర ముగింపు ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో చారిత్రక సభ నిర్వహించనున్నామని, ఆ సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశామని పార్టీ జాతీయ సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సమావేశానికి జాతీయ కార్యదర్శి డి.రాజా హాజరు కానున్నారన్నారు.