MLG: వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతానికి ఆదివారం వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీంతో జలపాతం పరిసరాలు సందడిగా మారాయి. అధిక నీటి ప్రవాహం కారణంగా అటవీశాఖ అధికారులు స్విమ్మింగ్ పూల్లోకి అనుమతి నిరాకరించారు. నిబంధనలు పాటించాలని, బొగత తప్ప ఇతర జలపాతాలకు అనుమతి లేదని హెచ్చరించారు.