టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సత్యారెడ్డి ‘కింగ్ బుద్ధ’ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.