NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల జ్వరంతో బాధపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం కుదుటపడాలని నగరంలోని ఆమని గార్డెన్స్‌లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామికి జనసేన జన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడడంతో ఇవాళ స్వామివారికి ఆకు పూజ తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.