CTR: శాంతిపురం(M) అనికెర పంచాయతీ వడగండ్లపల్లి ఎస్సీ కాలనీలో రూ.12 లక్షలతో మూడు సీసీ రోడ్డు పనులను మండల పార్టీ అధ్యక్షుడు ఉదయ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్య ఇస్తోందని, గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.