VZM: ఎస్. కోట పంచాయతీ సీతంపేటలో ఆదివారం ఓట్ చోర్ గద్దె చోడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ కోట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గేదెల తిరుపతి ఆధ్వర్యంలో ప్రజలకు కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరణ చేశారు. దేశంలో ఓట్ల చోరీని అరికట్టేందుకు ఏఐసీసీ ఆదేశాలతో ఈ నెల 15 వరకు సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.