ఎన్టీఆర్: రైళ్లలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు విజయవాడ డివిజన్ పరిధిలోని కోచ్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 920 కోచ్‌లకు గాను కేవలం 51 కెమెరాలే ఏర్పాటు చేయగా, అందులో 34 మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.