కృష్ణా: గుడివాడ బిళ్లపాడు రైల్వే గేట్ వద్ద ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాకర్ల వీధికి చెందిన సుబ్బారావు చిన్నఎరుకపాడు నుంచి తన స్వగృహానికి వెళ్తుండగా, వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.