KRNL: అక్టోబర్ 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జిల్లా పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం రెడ్, గ్రీన్, ఎల్లో జోన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చిన్న వ్యాపారుల బంకులు, షాపులు, కొట్టులు తొలగించరాదని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు పి.ఎస్. రాధాకృష్ణ డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తే తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.