దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయాలనుకునేవారు భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశాన్ని రెండుగా విభజించాలని, మావోయిస్టులకు మద్దతు ఇవ్వాలని, ఆర్టికల్ 370ని సమర్థించాలని కోరుకోవడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు రాదని రిజిజు స్పష్టం చేశారు.