ప్రకాశం జిల్లా జన విజ్ఞానిక వేదిక ఆధ్వర్యంలో కనిగిరిలో ఆదివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీసీ పల్లి మండలం వెంగళాయపల్లి పాఠశాల పనిచేస్తున్న స్వర్ణ వెంకట రమణయ్య బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచినందుకు, సొంత నిధుల ద్వారా పాఠశాలలో సౌకర్యాలు నెలకొల్పినందుకు రమణయ్యకు అవార్డు లభించింది.