KDP: ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి ఏడాదికి 15వేల రూపాయలు చొప్పున రెండు లక్షల 90 వేల 669 మందికి 436 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయడం హర్షనీయమని తులసి రెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకానికి ఆటో డ్రైవర్ల పథకం అని పేరు పెట్టే బదులు ఆటో ఓనర్ల పథకము పేరు పెట్టడం సమంజసమని అన్నారు.