SRD: కంగ్టి మండలం నాగూర్- బి గ్రామంలో ఉచిత టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు ఆదివారం ధ్రువీకరణ పత్రాలను మాజీ MPTC చిన్నమ్మ పంపిణీ చేశారు. గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో గత 3 నెలల క్రితం 30 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చినట్లు మండల కో-ఆర్డినేటర్ ఆలూరే మహానంద తెలిపారు. అయితే వారు శిక్షణ పొందినట్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశామన్నారు.