కోనసీమ: పి.గన్నవరం మండలం మానేపల్లిలో ఆదివారం జరిగిన దసరా ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో ఉన్న ట్రాక్టర్‌పై ఓ తారాజువ్వ వచ్చి పడడంతో అందులోని మందు గుండు సామాగ్రికి నిప్పు అంటుకుంది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరు అర్చకులు విజయ ప్రసాద్, రత్న గోపాల్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.