సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల ప్రకారం ఆదివారం లేపాక్షి మండలంలోని కోడిపల్లి, నాగేపల్లి దర్గా, విభూతిపల్లి గ్రామాలలో పోలీసులు గ్రామసభ నిర్వహించారు. గ్రామస్థుల సమస్యలు తెలుసుకుని ఫిర్యాదులను పరిశీలించారు. శాంతిభద్రత, ఆస్తి నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత, పోక్సో కేసులు, బాల్య వివాహాలు వంటి నేరాలపై అవగాహన కల్పించారు.