కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో సీతారామాంజనేయ దేవాలయంలో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విజయదశమి శుభదినాన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా శీర్ల వెంకటేశ్వర్ హాజరై పంచ పరివర్తన సిద్ధాంతాలు, సంఘ్ శతాబ్ద ప్రస్థానం గురించి విపులంగా అవగాహన కల్పించారు.