TG: బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ రిజర్వేషన్ల వలన SC, ST రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం జరగదన్నారు. బలహీనవర్గాలకు మద్దతుగా అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే బిల్లును ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. దీనిపై న్యాయపరమైన అంశాలను చర్చించేందుకు త్వరలో ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులను కలుస్తామని వెల్లడించారు.